కొబ్బరి కాయల్లోనుంచి వింత సౌండ్లు.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు

అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది. కొబ్బరి ఒలిచే కార్మికులను పరుగులు పెట్టించింది. అల్లవరంలో కొబ్బరి రాసులో చేరిన తాచుపాము కార్మికులను హడలెత్తించింది.

కొబ్బరి రాసి వద్ద కొబ్బరి కాయలు ఒలుస్తున్న కార్మికులకు వింత శబ్దాలు వినపడ్డాయి. అనుమానంతో కొబ్బిర రాసిలో గమనించిన కార్మికులకు తాచుపాము కనిపించింది. ఒక్కసారిగా తాచుపాము ఒక్కసారిగా పామును చూసిన కార్మికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కొబ్బరి తోట యజమాని శంకర్ కు చెందిన కొబ్బరి రాసి వద్ద తాచుపాము హల్‌చల్‌ చేసింది. అయితే పాము అప్పటికే ఎలుకను తిన్నట్లు గుర్తించారు.

కార్మికుల అలికిడికి తాచుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకుని సుమారు ఆరడుగుల పామును బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. కొబ్బరి కాయలు నిల్వ ఉంచే చోట ఎలుకలు, కప్పలు ఉండడంతో వాటిని తినడానికి పాములు చేరతాయని ఒలుపు కార్మికులు అప్రమత్తంగా ఉంటూ పనులు చేసుకోవాలని స్నేక్ క్యాచర్‌ వర్మ సూచించారు.

పాము బుసలు కొడుతున్న దృశ్యాలు అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో వీడియో తీయడంతో స్థానికంగా వైరల్‌గా మారింది.

About Kadam

Check Also

అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *