పహల్గామ్ లో అమాయక టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్పీఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఎన్కౌంటర్లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ , సులేమాన్షా, అబూ తల్హా హతమయ్యారు.
కశ్మీర్ రాజధాని శ్రీనగర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టిన ఆర్మీ .. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇప్పటికే.. ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన భద్రతా బలగాలు.. అణువణువు గాలించి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. ఈ క్రమంలోనే.. పహల్గామ్ లో అమాయక టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్పీఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఎన్కౌంటర్లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ , సులేమాన్షా, అబూ తల్హా హతమయ్యారని పేర్కొంటున్నారు. ఇంకా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.. పహల్గామ్ ఘటన అనంతరం ఆసిఫ్ ఫౌజీ , సులేమాన్షా, అబూ తల్హా ఒక్కొక్కరి తలపై ఆర్మీ 20 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ క్రమంలోనే.. వారి కదలికలను గుర్తించిన ఆర్మీ.. ఉగ్రవాదులను చుట్టుముట్టింది.
కాగా.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతిదాడికి దిగింది భారత్.. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివేంజ్ తీర్చుకుంది.