నేను ఏమైనా ఆయనకు సబ్ ఆర్డినేట్ నా? ఆయన ఎన్నిగంటలు ఆలస్యంగా వచ్చినా ఎదురు చూడలా..? నేనూ మంత్రినే.. నాక్కూడా ఆత్మగౌరవం ఉంది. కనీసం లేట్‌గా వస్తానన్న సమాచారం కూడా ఇవ్వలేదంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మంగళవారం నాగార్జునసాగర్ పర్యటన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోపం వచ్చింది. ఉత్తమ్ బ్రో.. నేను అలిగిన పో.. అంటూ ఇంటికి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నేను ఏమైనా ఆయనకు సబ్ ఆర్డినేట్ నా? ఆయన ఎన్నిగంటలు ఆలస్యంగా వచ్చినా ఎదురు చూడలా..? నేనూ మంత్రినే.. నాక్కూడా ఆత్మగౌరవం ఉంది. కనీసం లేట్‌గా వస్తానన్న సమాచారం కూడా ఇవ్వలేదంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టులో చోటు చేసుకున్న పరిణామం ఇది. బేగంపేట ఎయిర్ పోర్టు దాకా వెళ్లి సాగర్‌కు వెళ్లకుండానే సైడ్ అయిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
షెడ్యూల్ ప్రకారం నాగార్జునసాగర్ గేట్లు ఎత్తేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలి. అందుకోసం తనను ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉత్తమ్ చెప్పినట్టే తాను ఉదయం 9గంటల వరకే బేగంపేటకు చేరుకున్నానన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కోమటిరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉదయాన్నే ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10గంటల వరకు రాలేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గంట పాటు ఆయన కోసం ఎదురుచూసిన కోమటిరెడ్డి అలిగి ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఉత్తమ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన వెంకట్ రెడ్డి తన సాగర్ టూర్‌ను రద్దు చేసుకున్నారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేకుండా లక్ష్మణ్‌తో కలిసి నాగార్జున సాగర్ కు హెలికాప్టర్‌లో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఇక బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఎపిసోడ్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి