నిండా సరుకుతో హైవేపై దూసుకొచ్చిన కారు.. ఇంతలో పుష్ప మాదిరి ట్విస్ట్.. చివరకు జరిగిందిదే..

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియా.. ఓ బొలెరో వాహనం దూసుకొస్తుంది.. బొలెరో వాహనం నిండా ఏవోవో సరుకుల బస్తాలున్నాయి.. పోలీసులకు ఏదో అనుమానం కలిగింది.. దీంతో వారిని ఆపారు.. కానీ.. వాహనంలో ఉన్న వారు టెన్షన్ తో వాహనం స్పీడును మరింత పెంచారు.. అలా వాహనం స్పీడుగా ఉన్న క్రమంలోనే.. బొలెరో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు వారిని పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో సినీ ఫక్కీలో గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టుచేశారు. పుష్పా సినిమా మాదిరిగా గంజాయి రవాణా చేస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి బొలెరో వాహనంలో గంజాయి తీసుకుని.. రాజనగరం హైవే ప్రాంతంలో కంటైనర్ లో మార్చుకుని హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు..ఈ క్రమంలో పోలీసులను చూసి గంజాయ్ బ్యాచ్ పారిపోయేందుకు ప్రయత్నించారు.. ఐతే సినీ పక్కిలో వాడపల్లి నుంచి అటవీ ప్రాంతంలో గంజాయి ముఠా వాహనాన్ని వెంబడించారు పోలీసులు. తాళ్లపాలెం దగ్గర పుష్పా సినిమా చిత్రికరణ ప్రాంతంలో సినిమా తరహాలో బొలెరో వాహనం నుంచి రన్నింగ్ లో ఉండగా దూకేశాడు స్మగ్లర్లు. పుష్పాలో అల్లు అర్జున్ ను పోలీసులు వెంబడించే క్రమంలో కలప లారీను ఓ బావిలోకి వదిలేసినట్లు.. ఇక్కడ కూడా బొలెరో వాహనాన్ని తోట వైపుకు వదిలేసింది గంజాయి ముఠా..

వారిని వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు నేరస్థులను పట్టుకున్నారు. ఈ గంజాయి ముఠాలో నలుగురు నిందితులు అరెస్ట్ కాగా.. మరి కొంతమంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. కోటి పదిహేను లక్షలు విలువైన 1142 కేజీల గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. బొలెరో వాహనం, పైలట్ బైక్ ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంతరాష్ట్ర గంజాయి ముఠా

అరస్టయిన నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు. చింతపల్లి, సీలేరు, వరంగల్ ప్రాంతాలకు చెందిన గమిలి రాజేష్, కోడా శ్రీకాంత్, బుక్కే దేవేందర్, వంతల కిరణ్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయ్ ను ఒరిస్సా చిత్రకొండ నుండి హైదరాబాద్, ముంబై తరలింస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. గంజాయి ముఠాలోని ప్రధానింతులు ఒరిస్సాకు చెందిన మరికొంత మంది కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి.. మరి కొంతమంది ప్రధాన నిందితులు కోసం దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ సాయి ప్రశాంత్ వెల్లడించారు.

About Kadam

Check Also

ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ నెల్లూరు పర్యటన.. భారీగా తరలివచ్చిన జనాలు!

జగన్‌ పర్యటనతో నెల్లూరు హాట్‌ ల్యాండ్‌గా మారింది. గత పర్యటనలో కనిపించిన సీన్స్‌ మళ్లీ కనిపించాయి. పోలీసుల ఆంక్షల మధ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *