ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత..

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ఈ అక్రమ సంబంధాలు చివరకు దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలో కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిపై.. భర్త కత్తులతో దాడి చేసిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగబోయిన రవి, లావణ్యలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. తొలుత వీరి సంసారం సాఫీగా సాగినప్పటికీ కొంత కాలంగా కుటుంబంలో గొడవలు ప్రారంభ మయ్యాయి. ఇదే గ్రామానికి చెందిన రవి ఫ్రెండ్, క్లాస్ మెట్ అయిన శంకర్ తో లావణ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. శంకర్ కు కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయింది. దీంతో కుటుంబంలో గొడవలు తీవ్రమయ్యాయి. వివాహేతర సంబంధం మానుకోవాలంటూ భార్యను హెచ్చరించాడు.

ఈ క్రమంలోనే.. మూడేళ్ల క్రితం తల్లి గారి ఇంటికి అని చెప్పి పిల్లలతో వెళ్ళిన లావణ్య భర్త రవిని వదిలేసింది. దీంతో ఎనిమిది నెలల క్రితం రవి కూడా రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం లావణ్య.. పిల్లలతో కలిసి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరికి మకాం మార్చింది. ఇక్కడే ప్రియుడు శంకర్ తో సహజీవనం సాగిస్తోంది. ఇదే సమయంలో రవి పెద్ద కూతురు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఫోటో లొకేషన్ ఆధారంగా భార్య లావణ్య రాయగిరిలో ఉన్నట్లు రవి గుర్తించాడు. ప్రియుడు శంకర్‌తో కలిసి లావణ్య సహజీవనం చేస్తోందని తెలిసి రగిలిపోయాడు. ఎలాగైనా శంకర్ ను హత్య చేయాలని రవి పథకం వేశాడు.

ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఇల్లు అద్దెకు కావాలంటూ తన రెండో భార్యతో రవి రాయగిరికి వచ్చాడు. లావణ్య శంకర్ ఉంటున్న ఇంటిదగ్గర రెక్కి వేశాడు రవి. భార్య లావణ్య, ప్రియుడు శంకర్ కలిసి ఉన్నారన్న సమాచారంతో భర్త రవి.. లావణ్య ఇంటికి వెళ్ళాడు. శంకర్ పై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా భార్య లావణ్య అడ్డుకుంది.. ఇదే సమయంలో శంకర్ ఇంటి నుండి పరారయ్యాడు. ఆగ్రహంతో ఉన్న రవి కత్తితో భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య లావణ్య కాళ్లు రెండు విరిగిపోయాయి. లావణ్యను చికిత్స కోసం పోలీసులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. లావణ్య బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.

About Kadam

Check Also

గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *