బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పీ్కర్‌ మూడు నెలలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలపై తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్తు తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను తక్షణ చర్యల తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు సందర్భంగా ముఖ్య న్యాయమూర్తి CJI బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లోపల జరిగే పార్టీ మార్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇవి అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయగలవని ఆయన అన్నారు.

పార్లమెంటులో జరిగిన ప్రసంగాలను పరిశీలించాము తెలిపారు. గతంలో రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షీ మాట్లాడిన విషయాలను పరిశీలించామని.. డిస్‌క్వాలిఫికేషన్ కేసులను కోర్టుల వద్ద ఆలస్యం కాకుండా పరిష్కరించడానికి స్పీకర్‌కు ఈ బాధ్యత అప్పగించారని తేల్చామని సీజేఐ తెలిపారు. పెద్ద బెంచ్ ఎదుట ఇష్యూ పెండింగ్‌లో ఉందన్న వాదనపై కూడా చర్చించామని ఆయన పెర్కొన్నారు. ఆ కేసులో ఆర్టికల్‌ 136, 226ల కింద జ్యుడిషియల్ రివ్యూ పరిమితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

About Kadam

Check Also

వామ్మో మరీ అంతనా.. ఆ స్కూల్‌లో నర్సరీ ఫీజ్‌ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు బదులుగా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. డిమాండ్‌ పెరగడంతో ప్రైవేటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *