అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు రోజులు కాదు ఏకంగా, 15 రోజులు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు ఈ సెలవుల్లో రెండవ-నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆ పూర్తి డిటెల్స్ ఇక్కడ తెలుసుకుందాం…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ చట్టం ప్రకారం.. చెక్కులు, ప్రామిసరీ నోట్స్ వంటి పత్రాల ప్రాసెసింగ్ కూడా సెలవు దినాలలో జరగదు. అటువంటి పరిస్థితిలో మీకు ఈ నెలలో బ్యాంకులో ఏదైనా పని ఉంటే, ముందుగానే ఈ బ్యాంకు సెలవుల డిటెల్స్ తెలుసుకోవటం మంచిది. ఇది మీ సమయాన్ని, డబ్బును కూడా ఆదా చేసేందుకు తోడ్పడుతుంది.
ఆగస్టు 2025 సెలవుల పూర్తి జాబితా:
ఆగస్టు 8, 13 తేదీల్లో బ్యాంకులకు సెలవులు: ఆగస్టు 8 రక్షా బంధన్ రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీలో బ్యాంకులకు సెలవు. టెండోంగ్ లో రమ్ ఫట్ సందర్భంగా ఆగస్టు 8 (శుక్రవారం) సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆగస్టు 13 (బుధవారం) దేశభక్తి దినోత్సవ వేడుకల సందర్భంగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మాత్రమే బ్యాంకులు మూసివేయబడతాయి.