పవన్‌ కల్యాణ్‌ ప్రయోగం సక్సెస్‌… ఏనుగుల మందను తరిమేసిన కుంకీ ఏనుగులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు.. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి తరిమేశారు. చిత్తూరు, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు.. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి తరిమేశారు. చిత్తూరు, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. పంటల్ని కాపాడుకునే ప్రయత్నంలో పొలాల వైపు వెళ్లిన రైతులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. ఈ క్రమంలో ఏనుగుల్ని కట్టడి చేయడానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.. వెంటనే కర్నాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఏనుగుల్ని తీసుకొచ్చారు.

మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో కుంకీ ఏనుగులు గస్తీ నిర్వహించాయి. పలమనేరు అడవిలో 8 ఏనుగుల గుంపు సంచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకీ ఏనుగులను ఆ ప్రాంతానికి తరలించారు.

కుంకీ ఏనుగుల్ని తీసుకెళ్లారు.. శిక్షకులు వాటికి తగిన సూచనలు చేశారు.టేకుమంద ప్రాంతంలో ఏనుగుల గుంపు కనపడింది.. కుంకీ ఏనుగులు వాటిని పంట పొలాల వైపు రాకుండా అడ్డుకున్నాయి.. వాటిని అడవిలోకి మళ్లించాయి.

About Kadam

Check Also

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

వర్షాకాలం అంటేనే సీజనల్‌ వ్యాధులు భయపెడుతుంటాయి. వర్షాలతో కొత్త నీరు రాక, దోమల కారణంగా ప్రజలు ఎక్కువగా వ్యాధుల బారినపడుతుంటారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *