కాశీ యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఈ సౌలభ్యం. అదేంటో మరి చూసేయండి. ఆ ట్రైన్ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి. మీకే తెలుస్తుంది.
వచ్చేనెల సెప్టెంబర్ 2న భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బైద్యనాథ్ ధామ్(SCZBG46) 9 రాత్రులు / 10 రోజులుతో అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం బయలుదేరనుంది. ఇది కవర్ చేయబడిన గమ్యస్థానాలు, స్థలాలు ఇలా ఉన్నాయి..
పూరి: జగన్నాథ టెంపుల్ & కోణార్క్ సన్ టెంపుల్.
డియోఘర్: బాబా బైద్యనాథ్ ఆలయం
వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం & కారిడార్, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణ దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి
అయోధ్య: రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి.
ప్రయాగ్‌రాజ్: త్రివేణి సంగమం
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 11:00 గంటలకు బయలుదేరి, కాజీపేట జం, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజియనగరం మీదుగా ప్రయాణిస్తుంది.
ఛార్జీ ప్రతి వ్యక్తికి..
* SL: ₹17,000/-
* 3AC: ₹26,700/-
* 2AC: ₹35,000/-
ప్యాకేజీలో రోజుకు మూడు పూటల భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయి. అలాగే ప్రతి కోచ్‌లో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. IRCTC ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులకు కల్పిస్తోంది. మరింత సమాచారం కోసం www.irctctourism.comను విజిట్ చేయవచ్చు.