అవినీతికి అలవాటు పడిన గుంటనక్కలు ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేశాయి. సామాన్యుడు ఏ పని కోసం వచ్చినా.. రక్తం పిండుకునితాగే లంచగొండులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు ఎప్పటికీ రాదు. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడులు చేస్తున్నా.. సర్కార్ కార్యాలయాల్లో పెద్ద కొలువుల్లో ఉన్న అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. ఇటీవల కాలంలో పలువురు అవినీతి జలగలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం (ఆగస్ట్ 22) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా రాజేశ్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో రాజేశ్ డబ్బులు డిమాండ్ చేశాడు. సంతకం కావాలంటే రూ.లక్ష కట్టాల్సిందేనంటూ పట్టుబట్టాడు. దీంతో చేసేదిలేక బాధితుడు తొలి విడత రూ. 70 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్‌గా రాజేశ్ రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏపీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేశ్‌తో పాటు అదే కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్‌గా ఉన్న రమేశ్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ ఈ రోజు రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 2 గంటల పాటు సోదాలు చేశారు. గమనించిన ఇతర డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులకు తాళాలు వేసుకొని అక్కడ నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అన్ని ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal