కాకినాడ జిల్లా జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఒక బాలుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న ఆయన ఓ చిన్నారి చొక్కాపైనే తన ఆటోగ్రాఫ్ ఇచ్చి బాలుడితో పాలు అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఆ బాలుడు తెగమురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాకినాడ జిల్లా, పెద్దాపురంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను సీఎం పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికుల వివరించారు.
ఇదిలా ఉండగా ప్రజలతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు చూసేందుకు స్థానిక చిన్నారులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అది గమనించిన సీఎం చంద్రబాబు. వారి దగ్గరకు వెళ్లి వారితో కాసేపు సరదాగా మాట్లాడాడి కబుర్లు చెప్పారు. వారిలో స్పూర్తి నింపేందుకు ఆయన అందరితో కలిసి ఒక సెల్పీ కూడా దిగారు. అంతే కాకుండా ఆటో గ్రాఫ్ అడిగిన ఒక బాలుడి చొక్కాపై సీఎం నవ్వుతూ సంతంకం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజకీయ బాటలో బహుదూరపు బాటసారి… తమ వీధిలోకి ‘పక్కింటి అంకుల్’ మాదిరిగా ఆర్భాటం లేకుండా వచ్చాడు… మాట కలిపి సెల్ఫీ దిగాడు… పసి హృదయాల పై చెరగని సంతకం చేసి వెళ్ళాడు. ఆ చిన్నారులకేం తెలుసు అతనొక అసామాన్యుడని…అనితర సాధ్యుడని… తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు…
ఇదిలా ఉండగా వైసీపీవి విష, ఫేక్ రాజకీయాలు అంటూ పెద్దాపురం సభలో ఏపీ సీఎం చంద్రబాబు ఆ పార్టీపై విరుచుకుడ్డారు. 10 ఏళ్లలో జరిగిన పది సంఘటనలు చెప్పి…వైసీపీ కుట్ర రాజకీయాలను వివరిస్తూ ఆ పార్టీ నాయకులపై ప్రశ్నల వర్షంకురిపించారు. ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే సిద్దాంతంగా వైసీపీ పనిచేస్తోందని ఆయన విమర్షించారు.