ఈ ఏడాది డిగ్రీ కౌన్సెలింగ్‌లో కాలేజీల లాగిన్ నుంచి కూడా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాట్లు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిగ్రీ కౌన్సెలింగ్‌లో కాలేజీల లాగిన్ నుంచి కూడా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాట్లు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే కళాశాలల నుంచి కూడా ఆకోర్సుల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాలు నమోదు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. అయితే కాలేజీల లాగిన్ నుంచి నేరుగా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేస్తే మాత్రం మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
వెబ్ ఐచ్ఛికాల విషయాలో విద్యార్ధులకు ముఖ్య సూచనలు..
- డిగ్రీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు దరఖాస్తు సమయంలో మొదట ఒక కాలేజీ నుంచి నచ్చిన కోర్సును ఎంపిక చేసుకొని, ఆ తర్వాత మరో కాలేజీకి వెళ్లి వెబ్ ఐచ్ఛికం పెడితే రెండోసారి పెట్టిన కాలేజీకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే చివరిగా ఏ కాలేజీ నుంచి ఐచ్ఛికం పెడితే దానినే పరిగణనలోకి తీసుకుంటారన్నమాట.
- అదే విద్యార్థి ఆన్‌లైన్‌లో నేరుగా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకుంటే మాత్రం.. ఆ తర్వాత నచ్చిన కాలేజీకి వెళ్లి వెబ్ ఐచ్ఛికాలు పెడితే ఆ కాలేజీ నుంచి పెట్టిన వాటికే తొలి ప్రాధాన్యం ఇస్తారు.
- విద్యార్ధి మొదట ఓ కాలేజీ నుంచి కోర్సులు ఎంపిక చేసుకొని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా ఐచ్ఛికాలు పెట్టుకుని, అనంతరం మరో కాలేజీకి వెళ్లి మళ్లీ ఐచ్ఛికాలు పెట్టుకుంటే.. చివరి సారిగా ఏ కాలేజీ నుంచి వెబ్ ఐచ్ఛికాలు పెడతారో.. దానికే ప్రాధాన్యం ఇస్తారు.
హైదరాబాద్ జేఎన్‌టీయూలో మిగిలిన సీట్ల భర్తీ రేపే స్పాట్ ప్రవేశాలు
జేఎన్‌టీయూహెచ్ అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు గస్టు 26 నుంచి స్పాట్ ప్రవేశాలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వర్సిటీ క్యాంపస్‌తో సహా మొత్తం 8 కళాశాలల్లో 978 సీట్లు మిగిలిపోయినట్లు డైరెక్టర్ బి బాలునాయక్ తెలిపారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో 23 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో అత్యధికంగా 13 సీట్లు మిగిలిపోయాయి. ఆయా కాలేజీల్లో సీట్ల భర్తీకి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.