IBPS క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ఐబీపీఎస్ ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఆగస్ట్ 28, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం లభించినట్లైంది..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS ) క్లర్క్ ఉద్యోగాల భర్తీకి 2025 ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరక దరఖాస్తు గడువు ఆగస్ట్ 21వ తేదీతో ముగిసింది. తాజాగా ఈ రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ఐబీపీఎస్ ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఆగస్ట్ 28, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం లభించినట్లైంది. ఈ నోటిఫికేషన్ కింద 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు, డాక్యుమెంట్ అప్‌లోడ్‌లో జాప్యం నివారించడానికి అభ్యర్థులు కాస్త ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 261 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 367 వరకు పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అభ్యర్దుల వయోపరిమితి ఆగస్టు 1, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ వర్గానికి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 228, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.175, ఇతర అభ్యర్ధులు రూ.850 చొప్పున చెల్లించాలి. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), స్థానిక భాష.
ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల కొత్త షెడ్యూల్ ఇదే..
- ఆన్‌లైన్ దరఖాస్తుల తుది గడువు: ఆగస్టు 28, 2025.
- ప్రిలిమ్స్ రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో
- మెయిన్స్ రాత పరీక్ష: నవంబర్ 29, 2025.