నిరుద్యోగుకు గుడ్‌న్యూస్.. 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 1616 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 1616 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటితోపాటు ఆర్టీసీ ఆసుపత్రుల్లో మరో 7 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్ట్‌ 22 దీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అభ్యర్ధులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ పోస్టులను జోన్‌ల వారీగా భర్తీ చేస్తారు. మల్టీజోన్‌ 1లో 858, మల్టీజోన్‌ 2లో 765 పోస్టులను నియమించనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టుకోవడానికి అనర్హులని నోటిఫికేషన్‌లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • గైనకాలజీ పోస్టుల సంఖ్య: 247
  • ఎనస్తీషియా పోస్టుల సంఖ్య: 226
  • పీడియాట్రిక్‌ పోస్టుల సంఖ్య: 219
  • జనరల్‌ సర్జన్‌ పోస్టుల సంఖ్య: 174
  • జనరల్‌ మెడిసిన్‌ పోస్టుల సంఖ్య: 166
  • పాథాలజీ పోస్టుల సంఖ్య: 94
  • ఆర్ధోపెడిక్‌ పోస్టుల సంఖ్య: 89
  • రేడియాలజీ పోస్టుల సంఖ్య: 71
  • ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ పోస్టుల సంఖ్య: 62
  • పల్మనరీ మెడిసిన్‌ పోస్టుల సంఖ్య: 58
  • సైకియాట్రి పోస్టుల సంఖ్య: 47
  • ఆప్తమాలజీ పోస్టుల సంఖ్య: 38
  • డెర్మటాలజీ పోస్టుల సంఖ్య: 31
  • హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 24
  • బయోకెమిస్ట్రీ పోస్టుల సంఖ్య: 8
  • మైక్రోబయాలజీ పోస్టుల సంఖ్య: 8

ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారికి 20 పాయింట్లు అదనంగా కలపనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులో పొందుపరిచిన అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

ఆ కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో పలు జిల్లాల్లో అపారనష్టం జరిగింది. ఇళ్లు, పంటలు నీటమునిగాయి.. ఇప్పుడిప్పుడే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *