శ్రీశైలం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. అక్కడి నుంచి డైరెక్ట్‌గా బస్సులు

 ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ పలు పుణ్య క్షేత్రాలకు స్పెషల్‌ బస్సులను నడుపుతోంది. అంతేకాకుండా నేరుగా బస్సులను బుక్‌ చేసుకునే వారికి ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే వారికి శుభవార్త అందించింది తెలంగాణ ఆర్టీసీ. భక్తుల సౌకర్యార్థం రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న RGIA క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న రాజీవ్‌ గాంధీ ఇంటర్నెషన్‌ ఎయిర్‌పోర్ట్‌ ( RGIA) బోర్డింగ్ పాయింట్ కి భక్తులు ప్రయాణించి.. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలానికి వెళ్లొచ్చు.

ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు శ్రీశైలానికి అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు http://tgsrtcbus.in వెబ్ సైట్ లోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, రిజర్వేషన్ సమయంలో వారు RGIA క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్‌ని ఎంచుకోవాలి. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను కోరుతోంది.

ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ పలు పుణ్య క్షేత్రాలకు స్పెషల్‌ బస్సులను నడుపుతోంది. అంతేకాకుండా నేరుగా బస్సులను బుక్‌ చేసుకునే వారికి ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *