నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు ఉద్యోగాల భర్తీకి వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో జాబ్‌ నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 రైల్వే సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో జాబ్‌ నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 రైల్వే సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులను అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్‌పూర్, తిరువనంతపురం.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో భర్తీ చేయనుంది. ప్రస్తుతానికి ఈ పోస్టులకు సంబంధించిన షార్ట్‌ నోటీస్‌ను మాత్రమే ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఉండవల్సిన విద్యార్హతలు, జోన్ల వారీగా ఖాళీలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ సవివరంగా చూసుకోవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 14, 2025 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరక వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి వేతనం ప్రారంభమవుతుంది. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

About Kadam

Check Also

ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు!

ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *