రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను రెండు రోజులపాటు వాయిదా వేశారు. తాజాగా ఈ జాబితాలో జేఎన్టీయూ హైదరాబాద్ కూడా చేరింది.
జేఎన్టీయూహెచ్ కూడా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 29, 30 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు తన ప్రకటనలో పేర్కొంది. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.
ఆగస్ట్ 30న ఎన్‌ఆర్‌ఐ, డ్యూయల్ కోర్సు సీట్ల భర్తీకి వాక్‌ఇన్ కౌన్సెలింగ్
తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిలో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద బీఎస్సీ వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అగ్రి ఇంజినీరింగ్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్ ఓ ప్రకటనలో తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అగ్రివర్సిటీ-ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే బీఎస్సీ డ్యూయల్ డిగ్రీ కోర్సుకు కూడా వాక్ ఇన్ కౌన్సెలింగ్ జరుపుతామని స్పష్టం చేశారు. రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగంలో ఈ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.