జీఎస్టీలో కీలక మార్పులు.. రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందా..? సెప్టెంబర్ 3న ఏం జరగనుంది..?

ఏ రేట్లు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి.. మోదీ చెప్పినట్లు ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారా..? జీఎస్టీలో కీలక మార్పులు ఉంటాయా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ సాగుతోంది. ఈ చర్చకు మరో నాలుగు రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది.

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంపైనే అందరి కళ్లు ఉండడానికి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనే కారణం. జీఎస్టీలో కీలక సంస్కరణలు తీసుకొస్తామని.. కొన్ని వస్తువుల రేట్లు తగ్గుతాయని మోదీ అన్నారు. ఈ సారి ప్రజలు డబుల్ దీపావళి చేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లకు బదులుగా.. రెండు-రేట్ల పన్ను విధానాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను  కౌన్సిల్‌కు పంపినట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందేమోనని కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఆదాయం తగ్గితే, దాన్ని భర్తీ చేయడానికి ఒక మార్గం ఉండాలని రాష్ట్రాలు కోరుతున్నాయని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ చెప్పారు.

8నెలల తర్వాత సమావేశాలు

నిబంధనల ప్రకారం.. జీఎస్టీ కౌన్సిల్ కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాలి. కానీ డిసెంబర్ 2024లో జరిగిన చివరి సమావేశం తర్వాత, ఇప్పుడు సుమారు ఎనిమిది నెలల తర్వాత ఈ కొత్త సమావేశం జరుగుతోంది.

ఈ రేట్లు తగ్గే ఛాన్స్..

సిమెంట్‌పై ప్రస్తుతం ఉన్న 28శాతం జీఎస్టీ రేటును 18శాతానికి తగ్గించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ తగ్గింపు నిర్మాణ రంగానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతమిస్తుంది. వ్యక్తులు కొనుగోలు చేసే టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని సున్నాకి తగ్గించే ప్రతిపాదన కూడా కౌన్సిల్ ముందుకు రానుంది. సెలూన్‌లపై విధించే 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఆహార, వస్త్ర వస్తువులన్నింటినీ 5శాం పన్ను శ్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది ఆహార, వస్త్ర పరిశ్రమలలో వర్గీకరణ సమస్యలను తొలగించి, పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది.

About Kadam

Check Also

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్‌ 30న పాఠశాలలు బంద్‌.. వరుసగా 2 రోజులు సెలవులు

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 30న పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *