ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏడేళ్ల జైలు శిక్ష!

నిందితులను జైలు పంపించాల్సింది పోయి తానే జైలుపాలు అయ్యాడు ఓ పోలీసు అధికారి. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఓ సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు అవినీతి నిరోధక కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది ఏసీబీ కోర్టు. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు సబ్ ఇన్స్‌పెక్టర్. దీంతో బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా.. సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అతన్ని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు సదరు ఎస్‌ఐకు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల రూపాయల జరిమానాను విధించింది.

విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు, అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్సైగా పని చేస్తున్న సమయంలో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో మంగరాజు, అతని కుటుంబ సభ్యులపై వరకట్నం నిషేధం చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఎస్సై తాత్సారం చేశారు. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మంగరాజు నుంచి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ పెద్దయ్య. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ పెద్దయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసు విచారించిన ఏసీబీ కోర్టు.. పెద్దయ్యకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల రూపాయల జరిమానాను విధించింది.

About Kadam

Check Also

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర.. ఏపీలో కలకలం రేపుతున్న సంచలన వీడియో..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *