విశాఖలో మరో స్పెషల్ అట్రాక్షన్.. టూరిస్టులకు కావాల్సింది ఇదికదా..! సగం రేటుకే చుట్టేయొచ్చు..

విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ పర్యాటక బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్ల కొండ వరకూ బీచ్ రోడ్‌లో ప్రయాణించనున్నాయి. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా డబుల్ డెక్కర్ బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తూ.. పర్యాటకులకు అభివాదం చేశారు. విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారు. అయితే పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రూ.250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్టును వర్తింప చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. పర్యాటకులంతా పర్యావరణ హితంగా వ్యవహరించాలి. మన తీరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్ లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలన్నారు.

విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పిచ్చారంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిల్లోనే కొట్టుకు పోయారన్నారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్ గా ఎదగబోతోందన్నారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తారు. ఈ కేబుల్ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందన్నారు. భారత్ కే టెక్నాలజీ హబ్ గా విశాఖ ఎదుగుతుందన్నారు. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపికైందని.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారింది.. ఇది మనం అంతా గర్వపడే అంశం అంటూ చంద్రబాబు వివరించారు.

About Kadam

Check Also

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర.. ఏపీలో కలకలం రేపుతున్న సంచలన వీడియో..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *