మంగళగిరి ప్రధాన వీధిలోని మండపంలో గణపతిని నోట్ల తో అందంగా అలంకరించారు. వ్యాపారులు తమ వద్ద నున్న నోట్లను ఇచ్చి కొత్త నోట్లను ముందుగానే తెచ్చుకుంటారు. నూతన కరెన్సీని మాత్రమే స్వామి వారి అలంకరణకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఎవరికి వారికి ఇస్తారు. సంకా బాలాజీ గుప్తా ప్రతి ఏటా ఈ అలంకరణను పర్యవేక్షిస్తారు. స్థానిక వ్యాపారులంతా సహకరిస్తారు.
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం మంగళగిరిలోని వినాయకుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ప్రతి ఏటా ప్రధాన వీధిలోని ఏర్పాటు చేస్తున్న విగ్రహం వద్ద సంకా బాలాజీ గుప్తా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక అలంకరణ చేస్తుంటారు. గత ఏడాది 2.30 కోట్ల కరెన్సీ నోట్లతో స్వామి వారిని అలకరించారు. ఈ ఏడాది మరో ఐదు లక్షల రూపాయలను అదనంగా జోడించి 2.35 కోట్ల రూపాయల నోట్లతో ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. పది, ఇరవై, యాభై, వంద, రెండు, ఐదు వందల నోట్లను ఇందుకోసం ఉపయోగించారు. ఒక్కో నోటు ఒక్కొ రకమైన పుష్పాలు, అల్లికలు తయారు చేసి వాటితో స్వామి వారిని అలంకరించారు.
మంగళగిరి ప్రధాన వీధిలోని వ్యాపారులు తమ వద్ద నున్న నోట్లను ఇచ్చి కొత్త నోట్లను ముందుగానే తెచ్చుకుంటారు. నూతన కరెన్సీని మాత్రమే స్వామి వారి అలంకరణకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఎవరికి వారికి ఇస్తారు. సంకా బాలాజీ గుప్తా ప్రతి ఏటా ఈ అలంకరణను పర్యవేక్షిస్తారు. స్థానిక వ్యాపారులంతా సహకరిస్తారు.
గత కొన్నేళ్లుగా కరెన్సీ నోట్లతో స్వామి వారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని బాలాజీ గుప్తా చెప్పారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలించారు. నోట్లతో స్వామి వారిని అలంకరించడంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. స్వామి వారి అనుగ్రహంతోనే ప్రతి ఏటా ఎటువంటి విఘ్నాలు లేకుండా నోట్లతో స్వామి వారిని అలకంరించే కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందని బాలాజీ గుప్తా చెప్పారు.