పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్‌లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్‌లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్-ఎఫ్‌ఆర్‌ఎస్ తప్పనిసరి చేయాలని అన్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్‌తో హాజరు శాతం మెరుగుపడుతుందని, వివిధ లోటుపాట్లనూ అరికట్టవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖపై మూడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకోసం కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కంటైనర్లపైన సౌర పలకలు ఏర్పాటుచేసి, అవసరమైన విద్యుత్తు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు గ్రీన్ ఛానల్‌లో ఆన్‌లైన్‌లోనే సాగాలి. మన ఊరు-మన బడి బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రహరీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్ట్ 22 నుంచి టాస్ పరీక్షలు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో పది, ఇంటర్ పరీక్షలు సెప్టెంబరు 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు సెప్టెంబరు 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబరు 6 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తాని స్పష్టం చేశారు.