గీతా ఆర్ట్స్ వారి పవన్ బర్త్ డే స్పెషల్ మ్యాష్అప్‌.. ఎమోషనల్‌ డైలాగ్స్, స్పీచ్ తో సినీ. రాజకీయ జర్నీ.. చూస్తే గూస్ బంప్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడు-రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గీతా ఆర్ట్స్ స్పెషల్ విశేష్ తో రిలీజ్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్స్ తో .. అయన నేచర్ ని .. ఆలోచన తీరుని.. సిని ప్రముఖులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలను, రాజకీయ ప్రయాణం.. అన్నీ పొందుపరిచారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటుడు-రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు వివిధ రకాలుగా చెబుతూ సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన రీల్స్, వీడియోలు, వివిధ రకాల ఫోటోలతో సోషల్ మీడియా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అనిపిస్తూ కళకళలాడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నాడు. తనదైన నటనతో మేనరిజంతో హిట్ ప్లాప్ కి సంబంధం లేకుండా క్రేజ్ ను సొంత చేసుకున్నాడు. అందరికీ అభిమానులుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులుంటారు. సెలబ్రిటీలు సైతం మేము పవన్ అభిమానులం చెప్పే ఘనతని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే.. ప్రజలకు ఎదో చేయాలంటూ రాజకీయాల్లో అడుగు పెట్టాడు. జనసేన పార్టీ పెట్టి.. గత ఎన్నిలల్లో నిలిచి గెలిచి నేడు ఎపీకి డిప్యూటీ సిఎం గా పదవిని చేపట్టి.. తనదైన శైలిలో పాలన చేస్తూ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.

అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ స్పెషల్ విశేష్ తో రిలీజ్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్స్ తో .. అయన నేచర్ ని .. ఆలోచన తీరుని.. సిని ప్రముఖులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలను, రాజకీయ ప్రయాణం.. అన్నీ పొందుపరిచారు. బండ్ల గణేష్ చెప్పిన.. ఈశ్వరా.. పవనేశ్వరా.. అనే డైలాగ్ మొదలైన ఈ వీడియోలో పవన్ సినీ జీవితంతో పాటు రాజకీయ రంగంలోని ఒడుదొడుకులను కూడా చూపారు. ఈ వీడియోలో పవన్ జర్నీ .. సినిమాలోని ఎమోషనల్‌ డైలాగులు.. ఐకానిక్ క్షణాలు, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు, జనసేనతో స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, పవన్ స్పీచ్‌లు ఒకే చోట కనిపిస్తూ.. ఫ్యాన్స్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి.


About Kadam

Check Also

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *