తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 118 పోస్టులకు మరో నోటిఫికేషన్‌ విడుదల! నెలకు రూ.లక్షన్నర జీతం

రాష్ట్రంలోని ప్రాసిక్యూషన్ సర్వీస్ (కేటగిరీ-6) విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాసిక్యూషన్ సర్వీస్ (కేటగిరీ-6) విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 118 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్దులు సెప్టెంబర్‌ 12 ఉదయం 8గంటల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు ఇవే..

  • మల్టీ జోన్ 1లో పోస్టుల సంఖ్య: 50 పోస్టులు (ఇందులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా 38, బ్యాక్‌లాగ్‌ కింద 12 పోస్టులు ఉన్నాయి)
  • మల్టీ జోన్ 2లో పోస్టుల సంఖ్య: 68 పోస్టులు (ఇందులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా 57, కింద 11 పోస్టులు ఉన్నాయి)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బాచిలర్ డిగ్రీతో పాటు LLB/BL లా డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 ఏళ్ల పాటు ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా అనుభవం ఉండాలి. అంతేకాకుండా ఈ ప్రకటన విడుదలైన తేదీ నాటికి ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా కొనసాగుతూ ఉండాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల వయోపరిమితి 01 జూలై 2025 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఐదేళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్స్‌ అభ్యర్దులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 5, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 12, 2025 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాతపరీక్ష ఎలా ఉంటుందంటే..

రాతపరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1లో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *