మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయితీ పెట్టుకోవడం.. జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం… కానీ ఇప్పుడు కొత్త సీన్ కనిపించింది. యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్న మహిళలు ఒక్క బస్తా కోసం పొట్టు పొట్టు తన్నుకుంటున్నారు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై మహిళ రైతులు శిఖలు పట్టుకొని తన్నుకోవడం సంచలనంగా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో యూరియా కొరత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది.. పరస్పర దాడులకు కారణంగా మారుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రైతులు గ్రోమోర్ సెంటర్ పై రాళ్లదాడి చేసి అక్కడ నిప్పుపెట్టారు.. ఆ సంఘటన మరువకముందే శుక్రవారం మరో ఘటన జరిగింది. యూరియా విక్రయ కేంద్రం వద్ద ఇద్దరు మహిళ రైతులు శిఖలు పట్టుకొని పొట్టు పొట్టు తన్నుకోవడం కలకలం రేపగా.. ఇది వైరల్గా మారింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్ లో ఆగ్రోస్ కేంద్రం వద్ద ఈ సీన్ జరిగింది.. యూరియా బస్తాల కోసం తెల్లవారుజామునుండే మహిళలు, రైతులు బారులు తీరారు.. ఈ క్రమంలో క్యూ లైన్ లో ఇద్దరు మహిళా రైతుల వద్ద ఘర్షణ చెలరేగింది. ఇద్దరు మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా ఇద్దరూ పోట్లాడుకున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలను బలవంతంగా ఆపారు.
ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం ముందు మహిళలు, పురుషులు ఆధార్ కార్డులు జిరాక్స్ లు పట్టుకొని పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలోనే ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వాట్సప్ లో వైరల్ గా మారాయి.. అయితే.. ఆ మహిళలు ఘర్షణ పడుతుండగా.. కొందరు కేకలు వేస్తూ నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.