భారత్‌లో టాప్‌ 10 ఐఐటీలు ఇవే.. ఇక్కడ ఇంజనీరింగ్ చదివితే లైఫ్ సెటిలంతే!

దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్‌ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్‌ పదిలంగా ఉంటుంది. 2025 నాటి NIRF ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ఐఐటీలు, వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఇంజనీరింగ్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలి. దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్‌ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్‌ పదిలంగా ఉంటుంది. 2025 నాటి NIRF ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ఐఐటీలు, వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

IIT మద్రాస్

IIT మద్రాస్ దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థగా తొలి ర్యాంక్ పొందింది. ఇది ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్‌తో సహా వివిధ విభాగాలలో విస్తృత శ్రేణి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. IIT మద్రాస్‌లోని BTech, MTech, MSc, BSc కోర్సుల్లో ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తుంది. IIT మద్రాస్‌లోని చాలా విభాగాలలో ప్రవేశం JEE మెయిన్, JEE అడ్వాన్స్‌డ్, IIT JAM, GATE వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ద్వారానే జరుగుతుంది. అలాగే అధిక కోర్సులకు ఫీజులు రూ. 1.2 లక్షల నుండి రూ.10 లక్షల మధ్య ఉంటుంది.

IIT ఢిల్లీ

IIT ఢిల్లీ సైన్స్, ఇంజనీరింగ్, డిజైన్‌లో విభిన్న శ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఇక్కడ ప్రధాన కోర్సు BTech ప్రోగ్రామ్. మొత్తం 14 స్పెషలైజేషన్లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. JEE అడ్వాన్స్‌డ్, JoSAA కౌన్సెలింగ్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు, MTech అడ్మిషన్లు GATE ద్వారా, MSc ద్వారా IIT JAM ద్వారా, MDలు CEED ద్వారా జరుగుతాయి. వివిధ కోర్సులకు ట్యూషన్ ఫీజులు ప్రోగ్రామ్, విద్యార్థి కేటగిరీని బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటాయి.

IIT బాంబే

JEE మెయిన్ ఆధారంగా BTech ప్రోగ్రామ్‌లో IIT బాంబే ప్రవేశం కల్పిస్తోంది. JEE అడ్వాన్స్‌డ్ ద్వారా కూడా ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ సంస్థ టెక్నాలజీ, సైన్స్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయిలలో సుమారు 86 కోర్సులను అందిస్తుంది. డిగ్రీ ప్రోగ్రామ్‌లతో పాటు, IIT బాంబే ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్ బేసిక్స్‌తో సహా స్వల్పకాలిక ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులను కూడా అందిస్తుంది. కోర్సును బట్టి ట్యూషన్ ఫీజులు రూ.1.2 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంటుంది.

IIT కాన్పూర్

ఇక్కడి అన్ని కోర్సులకు GATE, IIT JAM, CEED, CAT వంటి ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇక్కడి ప్రధాన కోర్సు BTech. దీనితో పాటు ఈ సంస్థ BSc, BS, MTech, MSc, MDes, MBA, మరి కొన్ని డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఫీజు పరిధి రూ. 8 లక్షల వరకు ఉంటుంది.

IIT ఖరగ్‌పూర్

ఈ సంస్థ ప్రధాన కోర్సు BTech. ఇందులో ప్రవేశం JEE అడ్వాన్స్‌డ్ స్కోర్‌ల ఆధారంగా ఉంటుంది. దీనితో పాటు IIT ఖరగ్‌పూర్ PhD ప్రోగ్రామ్‌లు, BSc/BS, ఇంటిగ్రేటెడ్ MTech, ఇంటిగ్రేటెడ్ MSc, LLM, MBA, ఎగ్జిక్యూటివ్ MBAలను అందిస్తుంది. కోర్సును బట్టి ఫీజులు రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుంది.

IIT రూర్కీ

ఇందులో JEE, ఇతర జాతీయ స్థాయి పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. IIT రూర్కీ ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్‌లో UG, PG డిగ్రీలను అందిస్తుంది. ఈ సంస్థ మాస్టర్ ఇన్ డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్), మాస్టర్ ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్ (MIM).. అనే రెండు కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ సంస్థలో ఫీజులు రూ. 10 లక్షల వరకు ఉంటాయి.

IIT హైదరాబాద్

ఎంఏ ప్రోగ్రామ్ మినహా, అడ్మిషన్లు పూర్తిగా ప్రవేశ పరీక్షల ఆధారితంగా ఉంటాయి. ఈ సంస్థ BTech కోర్సుల్లో ప్రవేశాలను JEE మెయిన్, JEE అడ్వాన్స్‌డ్ స్కోర్‌ల ఆధారంగా కల్పిస్తుంది. MTech అడ్మిషన్లకు GATE స్కోర్‌ తప్పనిసరి. ఫీజులు రూ. 8 లక్షల వరకు ఉంటుంది.

IIT గువహతి

JEE, GATE ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ద్వారా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సంస్థ ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ వంటి విభాగాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఫీజులు కోర్సును బట్టి మారుతూ ఉంటాయి. BTech కోర్సులకు రూ. 8 లక్షల వరకు, MSc ప్రోగ్రామ్‌లకు రూ. 20 లక్షల వరకు ఫీజు ఉంటుంది.

IIT వారణాసి

ఈ సంస్థ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. BTech, BTech-MTech (డ్యూయల్ డిగ్రీ), BArch, BPharma, MTech, MPharma, MSc, PhD వంటి డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రదానం చేస్తుంది. ప్రవేశాలు ఖచ్చితంగా ప్రవేశ పరీక్ష ఆధారితంగా జరుగుతాయి. ఎంచుకున్న కోర్సును బట్టి ఫీజులు రూ.10 లక్షల వరకు ఉండవచ్చు.

IIT ధన్‌బాద్

IIT ధన్‌బాద్ వివిధ స్పెషలైజేషన్లలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఇందులో కూడా ప్రవేశ పరీక్ష ఆధారితంగా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఏదైనా కోర్సులో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ముందుగా ఆయా సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్ష రాయాలి. ఫీజులు రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య ఉంటాయి.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు మరికొన్ని గంటలే ఛాన్స్‌.. ఇదే చివరి అవకాశం!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుముతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *