తెలంగాణ దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది.. అబ్బో.. ఇన్ని రోజులా..?

తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. ఈ ఏడాది దసరా పండగ సెలవుల లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించింది విద్యాశాఖ. ప్రతి ఏడాది మాదిరిగానే.. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా సెలవులు ఇచ్చారు. ఆ డేట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి..

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 4నుంచి తిరిగి సాధారణ తరగతులు పునప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

ఇక జూనియర్ కళాశాలల విషయానికి వస్తే.. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సెలవులు కుటుంబ సభ్యులు, బంధువులతో సమయం గడిపేందుకు, పండుగ ఉత్సాహాన్ని పంచుకునేందుకు మంచి అవకాశం కల్పిస్తాయి. ఇక దసరా సందర్భంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జాతరలు, ఉత్సవాలు జరుగుతాయి. దీంతో రోడ్లపై రద్దీ పెరగనుంది.

విద్యాశాఖ అధికారులు ఈ సెలవుల సమయంలో విద్యార్థులు తమ చదువులు, పనులను సమతుల్యం చేసుకోవాలని, అలాగే పండుగ సమయాన్ని ఆనందంగా, సురక్షితంగా గడపాలని సూచించారు.


About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *