యువర్ అటెన్షన్ ప్లీజ్.! ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇకపై సికింద్రాబాద్‌లో

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సిక్రింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే సేవలు మళ్ల అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లించబడిన లేదా టెర్మినల్ మార్పులు చేయబడిన రైళ్లన్ని ఇకపై వాటి పాత మార్గాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని స్పష్టం చేసింది. అలాగే కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ-కాచిగూడ- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12713/12714) మరోసారి సికింద్రాబాద్ నుండి నడుస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ట్రైన్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని ట్రైన్స్‌ సెప్టెంబర్‌ 9 నుంచి అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది.

అందుంబాటులోకి రానున్న ట్రైన్స్‌, తేదీలు

  • సికింద్రాబాద్‌ నుంచి ఇప్పటికే సేవలను ప్రారంభించిన ముంబై-విశాఖపట్నం డైలీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 18519/18520), విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం డైలీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12805/12806), చర్లపల్లి-మౌలా అలీ-సికింద్రాబాద్ మీదుగా తిరిగి వెళ్ళే రైళ్లలో కాజీపేట-హడప్సర్-కాజీపేట ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 17014/17013), కాకినాడ పోర్ట్-సాయినగర్ షిర్డీ-కాకినాడ పోర్ట్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 17206/17205)
  • సెప్టెంబర్ 9 నుండి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అందుబాటులోకి రానున్న మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 17208/17207),
  • సెప్టెంబర్ 12 నుండి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అందుబాటులోకి రానున్న వాస్కో డ గామా-జాసిదిహ్-వాస్కో డ గామా వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 17321/17322),

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *