పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్న శ్యామలరావును జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్‌ను ఈవోగా నియమించింది ప్రభుత్వం. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో కూడా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా పనిచేశారు. లేటెస్ట్‌గా ఆయనను మరోసారి ఈవోగా ప్రభుత్వం నియమించింది. గత కొన్ని రోజులుగా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా నియమితులు అవుతారంటూ ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. కాగా.. గతంలోనూ టీటీడీ ఈవోగా సింఘాల్ పనిచేశారు.
ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్న శ్యామలరావును జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్ కుమార్ మీనా, అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్, అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీగా సీహెచ్ శ్రీధర్, కార్మిక శాఖ సెక్రటరీగా శేషగిరి బాబు, గవర్నర్ స్పషల్ సెక్రటరీగా అనంతరాం, ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎమ్‌టీ కృష్ణబాబును ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
అలాగే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకు పూర్తి అదనపు భాద్యతలను అప్పగించింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Amaravati News Navyandhra First Digital News Portal