ఉపరాష్ట్రపతి ఎన్నికకు 2025 ఓటింగ్ ఈరోజు కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్.. ఫలితాలు.. రెండూ ఒకే రోజు వెలువడనున్నాయి. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సి. పి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు వీరే..
ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, సయ్యద్ నసీర్ హుస్సేన్, మాణికం ఠాగూర్, శతాబ్ది రాయ్ పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా శక్తి సింగ్ గోహిల్, మాణికం ఠాగూర్ వ్యవహరించనున్నారు. లోకసభలోని 543 మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం 1 స్థానం ఖాళీగా ఉంది. ఇక రాజ్యసభలోని 233 మంది సభ్యులు ఉండగా.. ఇందులో ప్రస్తుతం 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఈ మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లులో సగాని కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్ధిదే గెలుపు ఖాయం కానుంది.
నేడు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో సీఎం రేవంత్ రెడ్డి..
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేడు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులు కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో భారీగా రైతులు పంట నష్టపోయారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రిని కలిసి రూ.5000 కోట్ల ప్రాధమిక సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరిన సంగతి తెలిసిందే.