అటెండెన్స్ సరిగ్గా లేదన్న ప్రొఫెసర్.. కట్ చేస్తే.. స్టూడెంట్ చేసిన పనికి దెబ్బకు మైండ్ బ్లాంక్

ఏలూరు జిల్లా నూజివీడు త్రిబుల్‌ఐటీలో ప్రొఫెసర్‌పై స్టూడెంట్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఏకంగా కత్తితో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రం సంచలనం రేపుతోంది. ఘటనకు పాల్పడ్డ ఏం టెక్ (ట్రాన్స్‌పోర్ట్) స్టూడెంట్ మజ్జి వినాయక పురుషోత్తంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రస్తుతం ఐఐఐటీలో విద్యార్థులకు సెకండ్ సెమ్ పరీక్షలు జరుగుతున్నాయి. దీనికోసం విజయనగరానికి చెందిన పురుషోత్తం రావటంతో అక్కడ డ్యూటీలో ఉన్న సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజు అతడిని లోపలకి అనుమతించలేదు. సరియైన హాజరు లేదని, హెచ్‌ఓడి అనుమతి తీసుకోవాలని అయన సూచించారు. అయితే హెచ్‌ఓడి కూడా పురుషోత్తంను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. తిరిగి పరీక్ష హాల్‌కు చేరుకున్న పురుషోత్తం విషయాన్ని ప్రొఫెసర్ గోపాలరాజుకు చెప్పాడు.

ఆయన మరోసారి అనుమతి నిరాకరించటం తో పాటు వెళ్లకుండా అక్కడే వున్నా పురుషోత్తం ను బయటకు పంపేందుకు సెక్యూరిటీ గార్డులను పిలిచే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రొఫెసర్‌పై దాడి చేశాడు పురుషోత్తం. ఈ ఘటనలో ఆయనకు పలు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే సహచర విద్యార్థులు అప్రమత్తమై పురుషోత్తంను పట్టుకుని అతడి వద్ద వున్న కత్తిని లాక్కున్నారు. గాయపడ్డ ప్రొఫెసర్‌ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

అయితే పురుషోత్తం తన వెంట రెండు కత్తులు తీసుకురావటంతో ముందస్తు పథకం ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎంటెక్‌లో 70% అటెండెన్స్ లేకపోవడంతో పరీక్షకు అనుమతి లేదని హెచ్ఓడి చెప్పారని ఈ కోపంతోనే పురుషోత్తం కత్తితో ప్రొఫెసర్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు పురుషోత్తం పై హత్యాయత్నం కు సంబంధించి పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటనపై మంత్రి లోకేష్ సైతం తీవ్రంగా స్పందించారు. గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని , ఉద్దేశ్యపూర్వకంగా వారు స్టూడెంట్స్ చెడును కోరుకోరన్నారు. స్టూడెంట్స్ హింస, నేర ప్రవృత్తిని ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు.

About Kadam

Check Also

అక్క స్కూల్‌కు వెళ్తుండగా వెంట వచ్చిన బాలుడు.. కాసేపటికే వెలుగు చూసిన దారుణం!

నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అక్క …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *