కేవలం 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. జూలైలో 10 మరణాలు, ఆగస్టులో 10 మరణాలు, సెప్టెంబర్ ప్రారంభంలో మూడు మరణాలు సంభవించాయి. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే ప్రాణాలు..
వరుస మరణాలతో మరణ మృదంగం మోగించిన గుంటూరు తురకపాలెంలో బుధవారం (సెప్టెంబర్ 10) ఐసీఎంఆర్ బృందం పర్యటించనుంది. మరణాల మిస్టరీ చేధించేందుకు ఇప్పటికే గ్రామంలో పర్యటించిన పలు జాతీయ సంస్థలు అక్కడి శాంపిల్స్ సేకరించారు. దీనిపై జాతీయ సంస్థలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్, ఐసిఏఆర్, NCDC, NHC బృందాలు గ్రామంలో పర్యటించాయి. నేడు ICAL ప్రాధమిక నివేదిక అందివ్వనుంది. ఇందులో భాగంగా గ్రామంలో మట్టి, త్రాగునీటి నమూనాలు ICAR సేకరించింది.
మిస్టరీ మరణాలకు అదే కారణం.. ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు
బ్యాక్టీరియా కారణంగానే చనిపోయారంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు. క్రమ క్రమంగా వీడుతున్న మరణాల మిస్టరీ. జాతీయ స్థాయి సంస్థల నివేదిక మరింత స్పష్టత వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. దీంతో ఆందోళన నుండి స్థానికులు బయటపడుతున్నారు.
కాగా కేవలం 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. జూలైలో 10 మరణాలు, ఆగస్టులో 10 మరణాలు, సెప్టెంబర్ ప్రారంభంలో మూడు మరణాలు సంభవించాయి. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరో ఇంట్లో ఇంకొకరు చనిపోతున్నారు. ముఖ్యంగా 1200 మంది నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీలోనే ఎక్కువగా మరణాలు నమోదు కావడంతో మూఢనమ్మకాలకు దారితీస్తుంది. గ్రామంలో ఇటీవల ఏర్పాటుచేసిన బొడ్రాయే ఈ మరణాలకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఎస్సీ కాలనీలో పారిశుధ్య లోపం, క్వారీ కాలుష్యం, కలుషిత భూగర్భ జలాలు అనారోగ్యానికి దారితీస్తునట్లు వైద్య బృందం ప్రాథమికంగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జాతీయ సంస్థల నివేదికలు వెల్లడించిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది.