అధికారం చేతులు మారగానే.. గోడదూకేశారు. హమ్మయ్య అధికార పార్టీలోకి వచ్చేశాం.. ఇక సేఫ్ అనుకున్నారు. కానీ, ఫిరాయింపులమీద సుప్రీం ఆదేశాలు.. ఆ వెంటనే స్పీకర్ నోటీసులతో.. ఇప్పుడు సీన్ మొత్తం రివర్సయిపోయింది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు, ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అనర్హతపై “తాడోపేడో” అంటుండగా, మరికొందరు సైలెంట్‌గా ఏం జరుగుతుందో చూసే యోచనలో ఉన్నారు. ఇంకొందరు మాత్రం తాము అసలు పార్టీనే మారలేదంటున్నారు. బీఆర్ఎస్ మాత్రం… టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీవీ9 ఇటర్వ్యూలో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ… ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావిస్తామని చెబుతోంది. దీంతో ఈ అంశం ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
అధికారం చేతులు మారగానే.. గోడదూకేశారు. హమ్మయ్య అధికార పార్టీలోకి వచ్చేశాం.. ఇక సేఫ్ అనుకున్నారు. కానీ, ఫిరాయింపులమీద సుప్రీం ఆదేశాలు.. ఆ వెంటనే స్పీకర్ నోటీసులతో.. ఇప్పుడు సీన్ మొత్తం రివర్సయిపోయింది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు, ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో స్పీకర్ నోటీసులకు ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వగా… కడియం శ్రీహరి లాంటి వాళ్లు మాత్రం దేనికైనా రెడీ అంటున్నారట. మరికొందరు సైలెంట్‌గా ఏం జరుగుతుందో చూసే యోచనలో ఉన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తాము అసలు పార్టీనే మారలేదంటున్నారు.
టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ నిర్వహించిన క్రాష్ ఫైర్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ టీవీ9 వేదిక చేసిన ఈ కామెంట్స్‌నే పట్టుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంగీకరించారని తెలిపారు.
మరోవైపు మా భవిష్యత్ ఏంటి మహాప్రభో అంటూ ఇటీవల సీఎంకు మొరపెట్టుకున్నారు పార్టీ మారిన ఎమ్మెలు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహారలు రచిస్తోంది. ఇలా ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal