ఇంటర్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఎంపికైతే వేలల్లో జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సికింద్రాబాద్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 434 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2, ఫార్మసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియన్‌ వంటి వివిధ పారా మెడికల్ ఉద్యోగాను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 18, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 272
  • డయాలిసిస్‌ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 33
  • ఫార్మసిస్ట్‌(ఎంట్రీ గ్రేడ్‌) పోస్టుల సంఖ్య: 105
  • రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • లాబోరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 12

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్‌+2 లేదా ఫార్మసి, రేడియోగ్రఫిలో డిప్లొమా, డిగ్రీ, డీఎంఎల్‌టీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జనవరి 1వ తేదీ నాటికి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు 20 నుంచి 40 ఏళ్లు, డయాలిసిస్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 20 నుంచి 33 ఏళ్లు, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, ఫార్మసిస్ట్‌ పోస్టులకు 20 నుంచి 35 ఏళ్లు, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌-రే టెక్నీషియన్‌ పోస్టులకు 19 నుంచి 33 ఏళ్లు, ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, లాబోరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల వరకు వయసు ఉండాలి.

అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 18, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సీబీటీ ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.

పోస్టుల వారీగా జీతభత్యాలు ఇలా..

  • నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు నెలకు: రూ.44,900
  • డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నెలకు: రూ.35,400
  • ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌-రే టెక్నీషియన్‌ పోస్టులకు నెలకు: రూ.29,200
  • ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టులకు నెలకు: రూ.25,500
  • లాబోరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు: రూ.21,700.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *