రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ’ కేంద్రాల్లో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇకపై మీ సేవాల సెంటర్ల నుంచి నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. ఇంతకు ముందు మనకు క్యాస్ట్ పర్టిఫికెట్ కావాలంటే దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా.. ఎమ్మర్వో ఆమోదం పొందిన తర్వాతనే తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సార్లు వాళ్లు అందుబాటులో లేక పోతే.. ఈ సర్టిఫికెట్ పొందేందుకు వారం, రెండు వారాల సమయం కూడా పట్టేది.
దీంతో ఈ జాప్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలతో మీ సేవ విభాగం, సీసీఎల్ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దార్లతో సమావేశాలు నిర్వహించి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. గత 15 రోజుల నుంచి ఈ విధానం మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ తాజా మార్పుల తర్వాత ఇప్పటికే 17,571 మంది వరకు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
నేరుగా మీసేవ సెంటర్లో కుల ధ్రువీకరణ పత్రం ఎలా పొందాలి?
- మీ దగ్గర పాత ధ్రువీకరణ పత్రం నెంబర్ ఉంటే.. మీ సేవ కౌంటర్‌కు వెళ్లి ఆ నంబర్‌ను వాళ్లు చెప్పడం ద్వారా మీరు కొత్త ప్రింటవుట్ పొందవచ్చు.
- ఒక వేళ మీకు నంబర్ తెలియకపోతే.. మీరు మీ దగ్గర్లోని మీ సేవ సెంటర్ వెళ్లి సిబ్బంది సంప్రదించండి. వారు మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా మీ ద్రువ పత్రాన్నివెతికి ఇస్తారు.
- మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్‌సైట్‌ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించండి