బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..? అసలు నిజం తెలిస్తే అవాక్కే..

ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యపు అలవాట్లే ఈ సమస్యలకు ప్రధాని కారణమని వైద్యులు అంటున్నారు. అయితే కొంతమంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అని నమ్ముతారు. మరి ఇది నిజమేనా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్ల గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనే నమ్మకం చాలామందిలో ఉంది. కిడ్నీలో రాళ్లను వైద్య పరిభాషలో నెఫ్రోలిథియాసిస్ అంటారు. ఇవి సాధారణంగా మూత్రపిండాల లోపల చిన్న ముక్కలు పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి.  కాల్షియం, యూరిక్ యాసిడ్, ఇతర మినరల్స్ మూత్రపిండాలలో కలిసి స్ఫటికాలుగా మారి రాళ్లుగా గట్టిపడతాయి.

కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు:

శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు మూత్రం చిక్కగా మారుతుంది. ఇది మినరల్స్, లవణాలు గట్టిపడి రాళ్లుగా మారడానికి దారితీస్తుంది. కొన్ని రకాల కిడ్నీలో రాళ్ళు జన్యుపరంగా కూడా వంశపారంపర్యంగా వస్తాయి. ఆక్సలేట్లు, సోడియం, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి.

బీర్ – కిడ్నీ రాళ్ల మధ్య సంబంధం

చాలామంది బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని నమ్ముతారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని నెఫ్రాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ డా. హిమాన్షు వర్మ ప్రకారం.. బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల తరచుగా మూత్రం వస్తుంది. ఈ ప్రక్రియలో ఐదు మిల్లీమీటర్ల కన్నా చిన్న రాళ్ళు మూత్రం ద్వారా బయటకు పోవచ్చు. బీరులో రాళ్లను కరిగించే లేదా తొలగించే రసాయనాలు ఏవీ ఉండవు. ఎక్కువ నీళ్లు తాగినా కూడా చిన్న రాళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. బీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ పెరిగే ప్రమాదం ఉంది. బీరు, మద్యం, కూల్ డ్రింక్స్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. దీర్ఘకాలంలో ఇది కొత్త రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు. కాబట్టి, బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనే నమ్మకం పూర్తిగా తప్పు. ఇలాంటి నమ్మకాలను నమ్మకుండా, సరైన వైద్య సలహా తీసుకోవడం అవసరం.

కిడ్నీలో రాళ్లను ఎలా తొలగించాలి?

కిడ్నీలో రాళ్ల పరిమాణం ఇసుక రేణువుల నుండి గోల్ఫ్ బాల్ వరకు మారుతుంది. కొన్నిసార్లు ఇవి మూత్ర నాళంలో చిక్కుకుపోయి తీవ్రమైన నొప్పికి కారణమవుతాయి.

(NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

About Kadam

Check Also

బొద్దింకలను బెదరగొట్టి తరిమికొట్టే సింపుల్‌ టిప్స్‌..ఇలా చేస్తే మీ కిచెన్‌ ఆరోగ్యంగా ఉన్నట్టే..!

బొద్దింకలు ఏం చేస్తాయిలే అనుకుంటే పొరపాటే.. వీటిని లైట్‌ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *