భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గన్నవరం ఎయిర్‌పోర్టులోనూ దుర్గమ్మ దర్శనం భాగ్యం!

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈఓ శీనా నాయక్ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా, బెజవాడ అమ్మవారి దివ్యత్వాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాకపోకలు సాగించే ప్రయాణికులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా గన్నవరం ఎయిర్‌పోర్టులో అమ్మవారి రెండు భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు. ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం ఆశీర్వాదంతో సాగాలని ఈఓ శీనా నాయక్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకునే (అరైవల్) బ్లాక్‌లో ఒక భారీ చిత్రపటం, అలాగే బయలుదేరే (డిపార్చర్) బ్లాక్‌లో మరొక భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.

ఈ చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర్ శాండిల్య, అర్చకులు శ్రీ వెంపటి శ్రీధర్ లతో కలిసి ఈఓ శ్రీ శీనా నాయక్ గారు దేవస్ధాన సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బెజవాడ దుర్గమ్మ అనుగ్రహం విమానాశ్రయంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రయాణికులు అమ్మవారి దర్శనం చేసుకొని, తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా కొనసాగించాలని అన్నారు. ఈ చర్య వల్ల కేవలం ఆలయ అభివృద్ధి మాత్రమే కాకుండా, అమ్మవారి మహిమను మరింత విస్తృతం చేసినట్టవుతుందని అన్నారు.

మరోవైపు ఈవో శీనా నాయక్‌ మాట్లాడుతూ అమ్మవారి దర్శన భాగ్యం ప్రతి భక్తుడికి కల్పించడంతో పాటు అమ్మవారి పేరుతో నూతన రాజధానిలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెల కొలిపేందుకు మరింత కృషి చేయునున్నట్లు తెలిపారు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *