తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తక్కువ ధరకే కాశి, అయోధ్యలను చుట్టేయండి..

తిరుమల తిరుపతి, శ్రీశైలం, విజయవాడ వంటి పుణ్య క్షేత్రాలను వెళ్లేందుకు.. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి RTC బస్సులు పర్యాటకులకు నిరంతరం అందుబాటులో ఉన్నాయి. దీంతో అప్పటికప్పుడు ఈ క్షేత్రాలకు వెళ్లేందుకు కూడా రెడీ అవుతూ ఉంటారు. అయితే కాశి , అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను చూడాలని ఉన్నా.. ముందుగా రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలి. తర్వాత ఆయా ప్రదేశాల్లో సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు.. దీంతో TGSRTC సరికొత్త ఆలోచనలో ముందు కొచ్చింది. త్వరలో అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు RTC ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

పర్యాటకులకు , భక్తులకు అందుబాటులో ఉండే విధంగా TGSRTC ఇటీవల అనేక స్పెషల్ టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. వీటికి మంచి స్పందన వస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపధ్యంలో తమ సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని.. త్వరలో కాశి, అయోద్య వంటి అనేక ప్రసిద్దిగాంచిన పుణ్య క్షేత్రాల సందర్శనం కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకుని రానున్నామని చెప్పారు. సజ్జనార్ ఆదేశాలకు ఈ మేరకు ప్రత్యేక సదుపాయాలతో బస్సులను అధికారులు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

ఇప్పటికే ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ టీజీఎస్ఆర్టీసీ సేవ‌ల‌ను ప్రజలకు అందుబాటులో తీసుకుని వెళ్లేందుకు రకరకాల చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మూలమూలకు వెళ్లేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సౌకర్యం, సుఖవంతం అని ప్రతి ఒక్కరికీ తెలిసేలా.. ఇటీవల ల ప్రారంభించిన యాత్రాదానం ప్రాధాన్య‌త‌ను వివరించారు. అంతేకాదు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లతో పాటు బృందాలతో తీర్ధయత్రకు వేల్లలనుకునేవారికి బస్సులను అద్దెకు తీసుకోవడంతో పాటు, వస్తువ రవాణా కోసం కార్గో సేవలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

టీజీఎస్ఆర్టీసీ యాత్రాదానం ప్రవేశ పెట్టిన యాత్రా దానంలో ఎవరైనా వ్యక్తులు తమకు ప్రత్యేకమైన, సంతోషకరమైన సందర్భాలను పురష్కరించుకుని.. పేద విద్యార్ధులను, అనాథ‌లు, నిరాశ్ర‌యులైన వృద్దులు, దివ్యాంగులు వంటి వారిని ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు లేదా విహార యాత్రలకు తీసుకుని వెళ్ళవచ్చు. ఈ యత్రాదానం కార్యక్రమానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇది అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు డిపోల‌ వారిగా కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల‌ని సూచించారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *