తక్కువ ఖర్చుతో లెక్కలేనన్ని పోషకాలను కలిగి ఉన్న చేపలు వివిధ వ్యాధులకు కూడా ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాదు.. ఎండిన చేపలు, రొయ్యలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. ఇది ముఖ్యంగా తీరప్రాంత చేపలు తినే వారికి మంచి బలాన్ని ఇస్తుంది. ఎండు చేపలలో అధిక ప్రోటీన్ లభిస్తుంది.100 గ్రాముల చేపలో 60–80 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చేపల రకాన్ని బట్టి మారవచ్చు. అందువల్ల పోషకాహార లోపం ఉన్న పిల్లల పెరుగుదల, కండర ద్రవ్యరాశిని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, పెరుగుదలను ప్రేరేపించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఎండిన రొయ్యలు తినటం వల్ల కలిగే అనేక ఇతర ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఎండు రొయ్యల్లో ఖరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మేగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, జింక్, సెలీనియం, అయోడిన్, రాగి, మాంగనీస్, సోడియం వంటి ఖనిజాలు మన ఆరోగ్యానికి అత్యవసరమైనవి. ఇవన్నీ ఎండు రొయ్యల్లో సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఎండురొయ్యల్లో విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వున్నాయి. వారానికో పక్షానికో ఎండు రొయ్యలు తింటుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండు రొయ్యలను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి బరువును తగ్గించడం. ఎండు రొయ్యలు తింటే అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.
చిన్నరొయ్యల్లో విటమిన్లు, అయోడిన్, ప్రొటీన్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారు అదనపు పౌండ్లను తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఇవి మంచి ఎంపిక. జుట్టు కుదుళ్లు గట్టిగా వుంచడంలో ఎండు రొయ్యలు ఎంతో మేలు చేస్తాయి.
రొయ్యల్లో వుండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచించాయి. శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎండురొయ్యలు ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో అయోడిన్ కూడా కావాల్సినంతగా లభిస్తుంది. ఇది కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది.
ఎండు రొయ్యల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాలు, చర్మం, ఇతర శరీర కణాల నిర్మాణానికి, మరమ్మతుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రొయ్యల్లో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
Amaravati News Navyandhra First Digital News Portal