దిన ఫలాలు (ఆగస్టు 14, 2024): మేష రాశి వారికి ఊహించని విధంగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. వృషభ రాశి వారి కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మిథున రాశి వారు ఇతరులకు మేలు కలిగించే పనులు చేపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఊహించని విధంగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తు సామగ్రిని కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికా రులు మీ మీద కాస్తంత ఎక్కువగానే ఆధారపడతారు. లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడ తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు పెరు గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ఇంటి మరమ్మతులు చేప డతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇతరులకు మేలు కలిగించే పనులు చేపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపా రాల్లో ఆదాయానికి లోటుండదు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. రావా ల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపో తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అదనపు ఆదాయ ప్రయత్నాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యలను తగ్గించు కుంటారు. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. అనుకోకుండా మొండి బాకీలు వసూలవుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సహోద్యోగుల నుంచి సహకారం పెరు గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహ రించడం మంచిది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు తప్పకపోవచ్చు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి కుటుంబ వ్యవహారాల్ని చక్కబెట్టడం జరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తి కరంగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహన యోగం పడుతుంది. బంధుమిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబపరంగా కొన్ని శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం పెరుగు తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి కష్టనష్టాలున్నా వాటిని అధిగమించి ముందుకు వెడతారు. ఆర్థిక పరి స్థితి సజావుగానే సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మాన సిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తు తానికి ధనపరంగా ఎవరికీ, ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నా బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. కొందరు మిత్రులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహా రాల్ని విజయవంతంగా చక్కబెడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగం విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొందరు మిత్రులు మిమ్మల్ని బాగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఎక్కు వగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు పరవా లేదనిపిస్తాయి. అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఆశించిన విధంగా సాగిపోతాయి. వ్యాపారంలో కొద్దిగా మాత్రమే లాభాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం నిలకడగా ముందుకు సాగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబం మీద కూడా ఖర్చు పెరుగుతుంది. వ్యాపా రాల్లో కొన్ని కష్టనష్టాలను అధిగమిస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.