ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసన వానకుశ్రీశైలంలోని కొత్తపేటలో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. నంది సర్కిల్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లోకి వరద నీరు చేరింది.. స్థానికులు, భక్తులు ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలంలోని ప్రధాన రహదారులు వర్షపు నీటితో కనిపిస్తున్నాయి. కొన్ని రహదారులపై మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. శ్రీశైలం – హైదరాబాద్‌ రహదారిపై బండరాళ్లు విరిగిపడటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఎండి రోణంకి కూర్మనాధ్, అధికారులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ప్రకృతి విపత్తులు, పెద్ద ప్రమాదాలకు సంబంధించిన ప్రసారాల విషయంలో శాటిలైట్ టీవీ చానల్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలను జారీ చేసింది. వీక్షకులు ఎలాంటి గందరగోళానికి లోనుకాకుండా అన్ని ఛానల్స్ విపత్తులు, పెద్ద ప్రమాదాల ఫుటేజ్‌ను ప్రసారం చేసేటప్పుడు వీడియోపైన ఘటన తేదీ, సమయం స్టాంప్ ప్రముఖంగా కనిపించేలా చూసుకోవాలి అన్నారు. దీని వల్ల కచ్చితమైన సమయం, ప్రదేశం, వాస్తవ పరిస్థితి వీక్షకులకు తెలుస్తుందని.. అన్ని ప్రైవేట్ చానల్స్ ప్రోగ్రామ్ కోడ్ కు కట్టుబడి ఉండాలని సూచించింది.

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *