ఇంట్లో తులసి మొక్క ఉంటే.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి..!

హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా ఐశ్వర్యాన్నిచ్చే తులసి మొక్క గౌరవప్రధామైనది. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తులసి దగ్గర ఉంచకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా తులసి మొక్కకు దగ్గరగా పెట్టరాదు. ఇలా చేస్తే..లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తులసి మొక్క దగ్గర పెట్టకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

హిందువులు తులసి మొక్కను సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. అయితే, తులసి చెట్టు వద్ద గణపతి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉందని అంటున్నారు అదేంటంటే..

పురాణాల ప్రకారం..వినాయకుడు ఒకనాడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసీ దేవి నదిలోంచి బయటకు వస్తుంది. ఆమె గణపతి అందానికి ముగ్ధురాలై తనను పెళ్లి చేసుకోవాలని కోరిందట. కానీ, గణేషుడు ఆమెను నిరాకరించగా.. ఆగ్రహించిన తులసి..నీవు రెండు వివాహాలు చేసుకుంటావని గణేషుడిని శపిస్తుందట.! అలా తులసి చెట్టు వద్ద గణేషుడి ప్రతిమ పెట్టకూడదని చెబుతుంటారు.

అలాగే, కొందరు కార్తీకమాసంలో తులసి చెట్టు వద్ద శివలింగాన్ని పెట్టి పూజలు చేస్తారు. అలా ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే.. తులసి మహా విష్ణువుకు ప్రీతికరమైనది. జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండేదట. అయితే, జలంధరుడిని పరమ శివుడు సంహరించాడట. ఈ కారణంగా పరమ శివుడిని తులసితో పూజించరని వేద పండితులు చెబుతున్నారు.

ఇకపోతే, పవిత్రమైన తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు, చెత్త వంటివి ఉంచకూడదు. చీపురుని ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు. ఆ చీపురుని తులసి మొక్క దగ్గర పెడితే కష్టాలు తప్పవట. ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, అనారోగ్య కష్టాలు మొదలవుతాయి. తులసిలో లక్ష్మీదేవి ఉంటుంది. తులసి చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వెంటనే తీసేయండి.

తులసికి ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు. కావున తులిసి చెట్టు వద్ద చెప్పులు ఉన్నట్లయితే ఇంట్లో ఆనందం కరువు అవుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. తులసి దగ్గర ముళ్ల మొక్కలు ఉండకూడదు. తులసి దగ్గర ముళ్ల మొక్కలు ఉంటే ఇంట్లో చాలా త్వరగా నెగెటివిటీ వ్యాపిస్తుంది.

About amaravatinews

Check Also

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి.. చూసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం

కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. తిరుమలలో అనేక పవిత్ర ఉత్సవాలు జరుగుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *