భారతదేశం సెమీకండర్టర్ల రంగంలో వేగంగా కదులుతోంది. ప్రధానమంత్రి మోదీ మంగళవారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. మంత్రి వైష్ణవ్ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్, నాలుగు ఆమోదించిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధాని మోదీకి అందించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్‌ను ప్రధాన మంత్రి …
Read More »TimeLine Layout
September, 2025
-
2 September
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి.. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో …
Read More » -
2 September
నేటి నుంచి మెగా డీఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. మీకు కాల్ లెటర్ వచ్చిందా?
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు ఇటీవల ఫలితాలు వెలువరించిన సంగతి తెలిసిందే. మెరిట్ జాబితాలోని అభ్యర్ధులకు 1:1 నిష్పత్తిలో తొలి విడత ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది.. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు ఇటీవల ఫలితాలు వెలువరించిన సంగతి తెలిసిందే. మెరిట్ జాబితాలోని అభ్యర్ధులకు …
Read More » -
2 September
ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ వేటు వేయడానికి కారణాలు ఇవేనా..?
అనుకున్నంతా అయ్యింది… బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని గులాబీఅధిష్ఠానం కన్నెర్ర చేసింది. గీతదాటితే, హద్దుమీరితే… కన్నకూతురైనా లెక్కచేయనన్న సంకేతాలు పంపిన గులాబీ దళపతి.. కవితపై బహిష్కరణ వేటు వేశారు. కొంతకాలంగా పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్న కవిత తీరుపై…. ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధినేత కేసీఆర్, ఏకంగా పార్టీ నుంచి బయటకు సాగనంపేశారు. తనకు ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక… చాలాకారణాలే కనిపిస్తున్నాయి. పార్టీ …
Read More » -
2 September
దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఇకపై అవి పాటించకపోతే ఆలయంలోకి నో ఎంట్రీ!
దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి వస్తున్నారా అయితే ఇకపై కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ఆలయానికి వచ్చే స్త్రీలైనా, పురుషులైన ఈ నిబంధనలు పాటించకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే వారికి ఎంట్రీ ఉండదని.. వచ్చిన దారిలోనే వారు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇంతకు ఏంటీ కొత్త నిబంధనలు తెలుసుకుందాం పదండి. ఇంద్రకీలాద్రి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆలయానికి వచ్చేటప్పుడు, ఆలయంలో ఉన్నప్పుడూ ఎలా ఉండాలి, ఎలా రావాలి అనేది పూర్తిగా మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. …
Read More » -
2 September
తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివితేనే లోకల్ కోటా వర్తింపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రాష్ట్రంలో స్థానికంగా ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే మెడికల్ కాలేజీ కోర్సుల ప్రవేశాల్లో 85 శాతం స్థానిక కోటా అమలు చేస్తామని గతంలో సర్కార్ జీవో 33ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో శాశ్వత స్థానికులకు వర్తించదని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని సమర్థిస్తూ తాజాగా అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్ర కోటా కింద మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి అర్హత సాధించాలంటే 12వ తరగతికి …
Read More » -
2 September
‘అమ్మే మన ప్రపంచం.. మన ఆత్మగౌరవం’.. విపక్షాలపై మండిపడ్డ ప్రధాని మోదీ
బీహార్‌లో రాజ్య జీవికా నిధి శాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది మహిళా ఎస్‌హెచ్‌జీలు, గ్రామీణ కాపరేటివ్స్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు ప్రధాని. బీహార్‌లో రాజ్య జీవికా నిధి శాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది మహిళా ఎస్‌హెచ్‌జీలు, గ్రామీణ కాపరేటివ్స్‌ను బలోపేతం చేయడంలో కీలక …
Read More » -
2 September
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్
BRS సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఆమె పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తూ ఉండటంతో.. అధినేత ఆదేశాల మేరకు పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలయింది. ఇటీవల కాలంలో …
Read More » -
2 September
వీళ్లు మామూలోలు కాడు.. గొర్రెలు కొట్టేద్దామనుకుని.. ఏం చేశారో తెలుసా..!
వృద్ధురాలిపై హత్యాయత్నం కేసును పల్నాడు జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చారు. గొర్రెల దొంగలను కాస్తా బంగారు అభరణాల దొంగలుగా మారినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దొంగలపై హత్యా కేసును నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పల్నాడు జిల్లా పిడుగరాళ్లకు చెందిన కుంచపు దుర్గా ప్రసాద్, ఎలీశా గుంటూరులోనే నివాసం ఉంటున్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు కట్టేసిన గేదెలు, పొట్టేళ్లు, గొర్రెలు, ద్విచక్ర …
Read More » -
2 September
హరీష్‌రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్..! ఎమ్మెల్సీ కవిత ఆరోపణల తర్వాత..
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావును తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి హరీష్ రావు కారణమని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, కేటీఆర్ హరీష్ రావును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. డైనమిక్ లీడర్ హరీష్ ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ …
Read More »