దసరా నుంచి పాఠశాలలకు సెలవుల సీజన్ స్టార్ట్ అయినట్లే భావిస్తారు పిల్లలు. అక్టోబర్ తర్వాత నవంబర్ అంతా బడికి వెళ్లిన స్టూడెంట్స్ కు డిసెంబర్ మళ్లీ సెలవుల సంతోషాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. డిసెంబర్ నెలలో దాదాపు 9 రోజులు హాలీడేస్ వస్తున్నాయి. అందులో 7 పక్కా కాగా.. రెండు మాత్రం కొన్ని స్కూల్స్ వాటి ప్రాధాన్యతను బట్టి ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇక మిషనరీ స్కూల్స్ మాత్రం 10 రోజులు హాలీడేస్ వస్తున్నాయి.
డిసెంబర్ నెలలో స్కూల్ పిల్లలకు ఎగిరి గంతేసేలా సెలవులు వస్తున్నాయి. క్రిష్టమస్ పండుగతో మిషనరీ స్కూల్స్ అదనంగా హాలీడేస్ ఉన్నాయి. సాధారణ పాఠశాలలకు 5 ఆదివారాలతో పాటు రెండు క్రిస్టమస్ హాలీడేస్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్రిస్టమస్ తర్వాతి రోజు కూడా హాలీడేస్ ను పాఠశాలలు ఇస్తాయి, దీంతో 8 రోజులు డిసెంబర్ నెలలో పాఠశాలలు మూతపడనున్నాయి. డిసెంబర్ 6వ తేదీన మతపరమైన స్కూల్క్ కొన్ని పాఠశాలలను ఏరియాను బట్టి మూసివేసే ఛాన్స్ ఉంది. ఇక క్రిస్టమస్ సందర్భంగా విద్యాశాఖ అకాడమిక్ కాలేండర్ లోనే మిషనరీ స్కూల్స్ కు 5 రోజులు సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకు విద్యాశాఖ మిషనరీ పాఠశాలలకు సెలవులు మంజూరు చేసింది. మరో ఐదు ఆదివారాలు డిసెంబర్ నెలలో ఉన్నాయి, మొత్తం 10 రోజులు మిషనరీ స్కూల్స్ విద్యార్థులకు సెలవులు రానున్నాయి.
దసరా తర్వాత పిల్లలంతా సంక్రాంతి హాలీడేస్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ సంక్రాంతికి ముందే డిసెంబర్ లో అధిక సెలవులు రావడంతో బడి పిల్లల సంతోషం అంతా ఇంతా కాదు. జనవరిలో సాధారణ పాఠశాలలకు సంక్రాంతికి 5 రోజుల హాలీడేస్ విద్యా శాఖ ఇచ్చింది. జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు రానున్నాయి. మొత్తంగా సెలవుల సందడి రెండు నెలల పాటు కొనసాగునుండగా.. ఆ తర్వాత పరీక్షల మోడ్ లో విద్యార్థులు వెళ్లనున్నారు.