అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు..

అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్‌లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌ వెలుపల అక్రమంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున వేతనం చెల్లిస్తుందని, స్థానికంగా ఉన్న స్టోర్‌లోనో లేక పెట్రోల్‌ బంక్‌లోనో పని చేయడం కంటే ఈ ఉద్యోగమే బాగుందని ఓహయోలో చదువుతున్న ఓ హైదరాబాద్‌ విద్యార్థి తెలిపారు.

ఓపెన్‌ డోర్స్ 2024 నిర్వహించిన సర్వేలో ఇంటి అద్దెకు విద్యార్థి నెలకు దాదాపు 300 డాలర్లు ఖర్చు చేస్తారని వెల్లడైంది. టెక్సాస్‌లో 39 వేలు, ఇలినాయిస్‌లో 20 వేలు, ఒహయోలో 13,500, కనెక్టికట్‌లో 7 వేల మంది భారతీయ విద్యార్థులు నివాసం ఉంటున్నారనీ వీరిలో 50 శాతానికి పైగా తెలుగు విద్యార్థులేనని నివేదిక బయటపెట్టింది. అయితే కాలిఫోర్నియా, టెక్సాస్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌, ఇలినాయిస్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య అధికం కావడంతో ఈ ప్రాంతాల్లో బేబీ సిట్టింగ్‌ పార్ట్‌ టైమ్‌ ఉద్యోగానికి డిమాండ్‌ ఎక్కువనీ తెలిపింది. దాంతో వేతనం తక్కువ లభిస్తున్నట్లు కొందరు విద్యార్థులు తమకు చెప్పినట్లు ఓపెన్‌ డోర్స్‌ నివేదిక బయటపెట్టింది.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *