నొక్కేస్తాడు.. గుట్టుగా అమ్మేస్తాడు.. మామూలు కానిస్టేబుల్ కాదు..! పోలీసు శాఖనే షేక్ చేశాడుగా..

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఓ కానిస్టేబుల్ గంజాయి దందా చేస్తుండటం కలకలం రేపింది.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి నుంచి కొంత కాజేసిన ఆ ఘరానా ఖాకీ.. యువకులే టార్గెట్‌గాచేసుకొని గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరిపాడు..

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఓ కానిస్టేబుల్ గంజాయి దందా చేస్తుండటం కలకలం రేపింది.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి నుంచి కొంత కాజేసిన ఆ ఘరానా ఖాకీ.. యువకులే టార్గెట్‌గాచేసుకొని గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరిపాడు.. గంజాయి తాగుతూ కొందరు యువకులు పట్టుబడడంతో ఆ కంత్రీ ఖాకీ గంజాయి వ్యాపారం గుట్టు రట్టయింది.. ఇంకేముందీ కటకటాల పాలయ్యాడు.. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటుచేసి గంజాయి, డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో పెకిలిస్తుంటే.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఓ కంత్రి ఖాకీ ఘటన పోలీస్ వ్యవస్థనే ఒక్కసారిగా షేక్ చేసింది.. ఈ ఒక్క ఘటన నాలుగు పోలీస్ స్టేషన్లను ఉలిక్కి పడేలా చేసింది. పట్టుబడ్డ రవి అనే కానిస్టేబుల్ ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ఇక్కడ పోలీసులు పట్టుకున్న గంజాయిలో కొంత భాగం నొక్కేసి తన ఇంట్లో మూడో కంటికి తెలియకుండా భద్రపరిచాడు.

ఆ గంజాయిని నగరానికి దూరంగా ఉండే నర్సంపేట ప్రాంతంలో కొంతమంది యువకులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నాడు. ఇతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన యువకులు నిర్భయంగా గంజాయి సేవిస్తూ, యాంటీ డ్రగ్స్ టీం పోలీసులకు పట్టుబడ్డారు. వారికి పోలీసులు తనదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తే అసలు గుట్టు బయటపడింది.. వారికి ఓ కానిస్టేబుల్ గంజాయ్ అమ్మాడని చెప్పడంతో షాక్ అయిన పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు..

ఈ క్రమంలో నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేసిన పోలీసులు ఆ కానిస్టేబుల్ ఎవరని ఆరా తీశారు.. ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురంలో నివాసం ఉంటున్నాడు.. తన ఇంట్లోనే గంజాయి భద్రపరిచి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.. కానిస్టేబుల్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మూడు కేజీలకు పైగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. అతని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.

ఈ ఘటన నాలుగు పోలీస్ స్టేషన్లను షేక్ చేసింది.. నర్సంపేటలో కేసు నమోదు కాగా.. నిందితుడు కానిస్టేబుల్ గంజాయి మాయం చేసింది ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్… అతను నివాసముంటున్న ప్రాంతం యూనివర్సిటీ పోలీస్ స్టేషన్.. ఇలా మూడు పోలీస్ స్టేషన్లతోపాటు.. యాంటీ డ్రగ్స్ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో అన్ని పోలీస్ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిపై పోలీసు అధికారులు లెక్కలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

About Kadam

Check Also

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే…!

నకిలీ నోట్ల చలామణి విషయాన్ని కొందరు వ్యాపారులు రాచకొండ చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపూర్ ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *