లిక్కర్ షాపులే వీరి టార్గెట్.. కన్నేస్తే సరుకు క్షణాల్లో హాంఫట్.. చివరికి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల ఒకేసారి మూడు మద్యం దుకాణాల్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎమ్మిగనూరు సీఐగా ఎవరు నూతనంగా బాధ్యతలు చేపట్టినా.. మరుసటి రోజే పట్టణంలో దొంగతనం చేసి దొంగలు సదరు సీఐకు స్వాగతం పలికేవారు. అదే విధంగా గత నెలలో నూతనంగా సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ శ్రీనివాసులుకు రెండో రోజే మూడు మద్యం దుకాణాల్లో దొంగలు చోరీ చేసి, నగదు అపహారించి సవాల్ విసిరారు.

ఆయా ఘటనలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ అంశాలను సీరియస్‌గా తీసుకున్న సీఐ శ్రీనివాసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యలను చెక్ చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు. అప్పటి నుండి దొంగలపై నిఘా పెట్టిన పోలీసులు ఎక్కడికి అక్కడ సిసి కెమెరాలలో దొంగలను పసిగడుతున్నారు.

వారు మరోసారి ఎమ్మిగనూరులో దొంగతనం చేయాలని వస్తున్నట్టు గుర్తించి, ఊరి శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇద్దరు దొంగలు బైక్‌పై వస్తుండగా పోలీసులు వారిని గుర్తించి అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి దొంగతనంకు ఉపయోగించిన సామాగ్రి, 71 వేల నగదు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక దొంగ మంగళగిరికు చెందిన మణికంఠ రెడ్డి,మరొకడు వినుకొండకు చెందిన వెంకట్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మణికంఠపై మంగళగిరిలో గతంలో 18 కేసులు ఉన్నాయని సీఐ శ్రీనివాసులు తెలిపారు.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *