విజయవాడ బస్ స్టేషన్‌ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌గా పిలుస్తారు. దీనిని తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ ఏ మారుమూల ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి బస్సులో వెళ్లాలంటే, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ టచ్ చేసి వెళ్లాల్సిందే..! ఎందుకంటే రాష్ట్రానికి సెంటర్ పాయింట్‌గా ఉన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద బస్ స్టాండ్. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రభుత్వం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ను నిర్మించారు. విజయవాడ నగరానికి దక్షిణం వైపు కృష్ణా నదికి ఆనుకున్న ఉంది. PNBS రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పర్యవేక్షణలో నడుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో సెప్టెంబర్ 23,1990న PNBS ను నాటి ప్రభుత్వం ప్రారంభించింది
విజయవాడ PNBS ప్రత్యేకత ఏమిటి?
PNBS భారతదేశంలో అతిపెద్ద, ఆసియాలో రెండవ అతిపెద్ద బస్ టెర్మినల్. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే బస్ టెర్మినల్. కాగా ఇక్కడి నుంచే ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు స్టేషన్లకు స్పెషల్‌గా సర్వీసులు నడుస్తాయి. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ వంటి వివిధ రాష్ట్రాల నుండి రోజూ అనేక బస్సులు PNBSకి వస్తూ, పోతుంటాయి. PNBS నుంచే రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి నగరానికి APSRTC స్పెషల్ కనెక్టివ్‌గా విజయవాడ బస్ స్టాండ్ ఉంది.
28 ఎకరాల సువిశాలంగా విస్తరించి ఉన్న PNBS రెండు టెర్మినల్స్‌తో 62 ప్లాట్ ఫారమ్‌లు ఉన్నాయి. విజయవాడ బస్ స్టేషన్‌లో 48 ప్లాట్‌ఫారమ్‌లతో డిపార్చర్ టెర్మినల్ ఉంది. 14 ప్లాట్‌ఫారమ్‌లతో అరైవల్ టెర్మినల్ తో సేవలు అందిస్తుంది. ప్రయాణికుల కోసం విశాలమైన పార్కింగ్, బస్సుల కోసం పెద్ద పార్కింగ్ ఏరియా ఉండటం PNBS ప్రత్యేకత. టికెట్ రిజర్వేషన్ కౌంటర్ త పాటు ప్రతి సిటీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ప్లాట్‌ఫారమ్‌లు సైతం ఉండటం విజయవాడ బస్ స్టాండ్ ప్రత్యేకత.
విజయవాడ బస్ స్టాండ్‌లో మరెక్కడా లేనన్ని సదుపాయాలతో అప్పట్లోనే నిర్మించారు. వెయిటింగ్ హాల్, రిజర్వేషన్ కౌంటర్స్, ఫుడ్ కోర్టులు, కొరియర్ సర్వీసులు, బోర్డింగ్, లాడ్జింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు అందించేలా అప్పట్లో PNBS నిర్మించారు. 1990 నిర్మించినా.. ఎక్కడా చెక్కుచెదరని విధంగా నిర్మాణం PNBS కు సొంతం. అయితే PNBS వినూత్నమైన శైలిలో నిర్మించారు. మొదట రైలు సర్వీసులు కూడా ఇక్కడి నుంచే అందించాలని భావించగా, అప్పట్లో అటు ఆర్టీసీ అధికారులు తమ ఆదాయానికి గండి పడుతుందని భావించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. చెన్నై వైపు వెళ్లే రైళ్ళను PNBS లోపలకి వచ్చి అక్కడ బస్ దిగిన ప్రయాణీకులను గమ్యాన్ని చేర్చడానికి వీలుగా నిర్మించాలని భావించారు. అయితే ఆ తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు..
ఇప్పటికీ 45 ఏళ్లు అవుతున్న భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగానే ఇప్పటికీ PNBS సేవలు అందిస్తుంది. ఇంతటి చరిత్ర కలిగిన PNBS మరింత ముందుకు ఇలాగే సాగాలని సేవలు అందించాలని కోరుకుందాం..!