పీఎల్ఐ స్కీమ్ సూపర్ సక్సెస్.. ఉద్యోగాల కల్పనలో రికార్డు

భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా భారతదేశం జనాభా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇంత స్థాయిలో ఉన్న జనాభాకు ఉద్యోగ కల్పనకు తయారీ రంగం కీలకం అని భావించి కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్ ద్వారా తయారీదారులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నారు. ఈ చర్యలు భారతదేశంలో ఉద్యోగ కల్పనలో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో పీఎల్ఐ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం దేశంలో ఉద్యోగ కల్పనలో నయా రికార్డును సృష్టించింది. జూన్ 2024 వరకు మొత్తం 5.84 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో లేదా అంతటా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం 16.2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల్లో 36 శాతంగా ఉంది. ఇటీవల ఓ ఆర్‌టీఐ అప్లికేషన్‌కు సమాధానంగా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఇంచుమించు 14 రంగాల్లో ఉద్యోగాల కల్పనలో పీఎల్ఐ కీలక పాత్ర పోషించింది. 

మొబైల్ ఫోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పీఎల్ఐ స్కీమ్ ద్వారా యువత భారీగా ఉద్యోగా పొందారు. ఈ మూడు రంగాల్లో సృష్టించిన మొత్తం ఉద్యోగాలలో 75 శాతానికి పైగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026-27 నాటికి 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉద్దేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన పీఎల్ఐ పథకం జూన్ 2024 నాటికి ఇప్పటికే 2.45 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. పీఎల్ఐ స్కీమ్ ఏప్రిల్ 2020లో ప్రకటించారు. దేశీయ తయారీని పెంచడంతో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా భారత ప్రభుత్వ ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది. 

పీఎల్ఐ స్కీమ్ నిర్దిష్ట ఉత్పత్తి, పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే అర్హత కలిగిన కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది.  ఈ ప్రోత్సాహం సాధారణంగా పెరుగుతున్న అమ్మకాలలో 4-6 శాతంగా ఉంటుంది. ఈ స్కీమ్ ప్రారంభంలో ఎలక్ట్రానిక్స్ రంగం కోసం ప్రారంభించారు. క్రమేపి ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఆటోమోటివ్, పునరుత్పాదక శక్తితో సహా బహుళ పరిశ్రమలను కవర్ చేస్తుంది. ఈ పథకం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను మెరుగుపరచడం, ఉపాధిని సృష్టించడం, ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించారు. 

About Kadam

Check Also

డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే.. అన్ని పార్టీల నుంచి పెరుగుతున్న డిమాండ్!

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల..పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *