గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం.. మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం.. నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించటంతో.. గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా.. ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డుల జారీలో వివక్ష చూపమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పేదలందరినీ ఆదుకొని వారికి అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఉందని.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
Check Also
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …